విశ్వంభరలో మరో మెగా హీరో.. అంచనాలు పెంచేస్తున్న వశిష్ట!

మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాలలోకి వెళ్లారు.

 Vaishnav Tej Play Key Role On Vishwambara Movie Details, Vasishta, Vishwambara,-TeluguStop.com

అయితే రాజకీయాలు తనకు సెట్ కాకపోవడంతో తిరిగి సినిమాలలోకి వచ్చారు.ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి సొంత కథలతో కాకుండా ఎక్కువగా రీమేక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అయితే ఈ సినిమాలు ఏవి కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Telugu Chiranjeevi, Vasishta, Vaishnav Tej, Tollywood, Trisha, Vaishnavtej, Vish

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా నటించిన సినిమాలలో ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం పరవాలేదు అనిపించింది కానీ మిగిలిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచాయి.అయితే ఈసారి మాత్రం భారీ సక్సెస్ అందుకోవడం కోసం చిరంజీవి కూడా కష్టపడుతున్నారు.బింబిసారా వంటి సూపర్ హిట్ సినిమా ద్వారా దర్శకుడుగా సక్సెస్ అయిన డైరెక్టర్ వశిష్ట( Vasishta ) దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర( Vishwambara ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Chiranjeevi, Vasishta, Vaishnav Tej, Tollywood, Trisha, Vaishnavtej, Vish

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటించగా మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించబోతున్నారని వార్తలు వచ్చాయి.అలాగే చిరంజీవి చెల్లెలు పాత్రలో మరొక యంగ్ స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారని సమాచారం.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమాలో మరో మెగా హీరో కూడా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube