సినీ నటి కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో దూసుకుపోతున్నారు.పెళ్లి చేసుకొని ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన కాజల్ తిరిగి వరస సినిమాలకు కమిట్ అవుతున్నారు ఈ క్రమంలోనే ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ( Satyabhama ) జూన్ 7వ తేదీ విడుదల కాబోతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న కాజల్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందు చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన ఆచార్య( Acharya ) సినిమాలో కూడా నటించారు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి కాజల్ పాత్రను చివరి నిమిషంలో తొలగించారు.కాజల్ తన పాత్రను తొలగించిన విషయంపై ఎప్పుడు ఎక్కడ కూడా స్పందించలేదు.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆచార్య సినిమా గురించి మాట్లాడారు.యాంకర్ కాజల్ ను ప్రశ్నిస్తూ.ఆచార్య సినిమా నుంచి మీ పాత్రను తొలగింపు పై మీ రియాక్షన్ ఏంటని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం చెబుతూ.ఇట్స్ ఓకే జరిగిందేదో జరిగిపోయింది.
నేను ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి ఆలోచించలేదు అలాగే ఎక్కడ ప్రస్తావించలేదు.మీరందరూ ఎలాగైతే ఫీలయ్యారో నేను కూడా అలాగే ఫీలయ్యాను.
ఇక ఈ సినిమా నుంచి నా పాత్రను ఎందుకు తొలగించారునే విషయం గురించి ఎవరిని కూడా నేను అడగలేదు అడగాల్సిన అవసరం కూడా నాకు రాలేదని తెలిపారు.ఇలాంటి వాటి గురించి మనం మన మనసులో ఆలోచిస్తూ కూర్చోకూడదని ముందుకు సాగుతూ ఉండాలి అంటూ ఈ సందర్భంగా కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.