సాధారణంగా కొందరికి చెంపలపై మొటిమలు, మచ్చలు( Acne, scars ) చాలా అధికంగా ఉంటాయి.ఇవి ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
అలాగే ఫేస్ ను అద్దంలో చూసుకున్న ప్రతిసారి మనశ్శాంతిని మరియు మనో ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తాయి.ఈ క్రమంలోనే చెంపలపై ఏర్పడిన మొటిమలు, మచ్చలను వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? ఎన్ని చేసినా చెంపలపై మొటిమలు మచ్చలు పోవడం లేదా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.
ఈ రెమెడీని పాటించారంటే ఎలాంటి మొండి మొటిమలైన మచ్చలైన పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు మరియు రెండు బిర్యానీ ఆకులు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్రైండ్ చేసుకున్న లవంగాలు బిర్యానీ ఆకు వేసి ఒక కప్పు వాటర్ పోసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో ఈ హెర్బల్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్ మరియు హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే ఒక మంచి సీరం అనేది తయారవుతుంది.ఈ సీరం ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న సీరంను చెంపలపై అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ సీరం ను కనుక వాడితే చెంపలపై ఏర్పడిన మొండి మొటిమలు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
చర్మం క్లియర్ గా మారుతుంది.మృదువుగా తయారవుతుంది.
మరియు అందంగా కూడా మెరుస్తుంది.