ఈ మధ్యకాలంలో చాలామంది వారి పిల్లల పెళ్లి కోసం పెద్దపెద్ద ఏర్పాటు చేసి వెళ్లిని బంధుమిత్రుల సమక్షంలో పెద్ద ఎత్తున గ్రాండ్ గా వివాహాన్ని జరిపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నుంచి మొదలుకొని చుట్టాల వరకు చాలా కార్యక్రమంలలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నుంచి మొదలుకొని చుట్టాల వరకు హంగామా హడావిడి సృష్టిస్తూ పెళ్లిని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్, అలాగే ఐదు రోజుల సాంప్రదాయమైన పెళ్లి ఇలా అనేక రకాలుగా పెళ్లిలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ లిస్టులోకి మరో వీడియో కూడా చేరింది.ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ఓ వివాహ కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సమయంలో వధువు( Bride )కు తన ప్రియుడు షాక్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.పెళ్లి కార్యక్రమం నేపథ్యంలో కాబోయే దంపతులిద్దరూ జయమాల తంతువు ముగిసిన తర్వాత వధువు మాజీ ప్రియుడు వేదిక పైకి వచ్చేసాడు.దాంతో అతనిని చూసిన పెళ్లికూతురు ఒక్కసారిగా కంగుతినింది.
స్టేజి పైనికి వచ్చిన ప్రియుడు పెద్ద హై డ్రామా క్రియేట్ చేశాడు.ఓవైపు పెళ్లి తంతు జరుగుతుండగానే.
మరోవైపు అతడు వేదికపై రచ్చ రచ్చ చేశాడు.
ఈ సడన్ సర్ప్రైజింగ్ కు ఆశ్చర్యపోయిన పెళ్ళికొడుకు( Groom ) పెళ్లి మండపం స్టేజిపై నుంచి దిగి గొడవను చూస్తున్నాడు.అయితే ఈ వీడియోని చూస్తే ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఏదైనా లైక్స్ కోసం చేశారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియ రావట్లేదు.ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.