కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?

చాలామంది వారి సొంత ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక వేరే ప్రాంతాలకు లేదా వేరే దేశాలకు వలస వెళ్లడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం.అలాగే ఆఫ్రికా ఖండం నుండి కొందరు పనుల కోసం చైనా దేశానికి వలస వెళ్లారు.

 Chinese Man Beats Workers With Belt At Will Viral Video , Disturbing Footage, O-TeluguStop.com

అయితే ఆఫ్రికా( Africa ) నుంచి ఉపాధి పనుల కోసం వచ్చిన వారిని చైనాలో పనిచేస్తున్న ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో తీవ్రంగా కొట్టిన సంఘటన ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ గా మారింది.

వీడియోలో ఓ చైనా వ్యక్తి ప్రదర్శించిన జాత్యహంకార మిషన్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ఈ వీడియో.

ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేయగా అది., తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన కార్మికులను చైనా కంపెనీ( Chinese company )కి చెందిన మేనేజర్ ట్రాన్స్ – అట్లాంటిక్ బానిసలు లాగా వారిని పరిగణిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఓ ఇద్దరి యువకులు కంటైనర్ లో కూర్చొని ఉండగా వారిని తిడుతూ బెల్టుతో ఇష్టానుసారంగా కొట్టడం గమనించవచ్చు.

చైనా కంపెనీ మేనేజర్ ఇలా ప్రవర్తించడం ద్వారా ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తలకు గాయం కాకుండా ఆ యువకుడు తన చేతిని అడ్డంగా పెట్టడం గమనించవచ్చు.వారు తమని కొట్టొద్దని ఎంత వేడుకున్నప్పటికీ కూడా ఆ మేనేజర్ ఎలాంటి కనికరం చూపించకుండా ఇష్టం వచ్చినట్టు బెల్టుతో కొట్టాడు.ఒక చివరగా ఓ యువకుడుని కాలితో తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

దీంతో ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ జాత్యహంకారాలు చూపించిన చైనా మేనేజర్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున విమర్శల వెళ్లువలు ఎక్కువయ్యాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube