ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ఒక అంచనాకు వచ్చింది.
ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అల్లర్లు , జరిగే అవకాశం ఉందని గుర్తించింది.ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో భారీగా బలగాలను మోహరించడంతో పాటు, ప్రతి పోలింగ్ బూత్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ఎన్నికల సంఘం గుర్తించిన సమస్యాత్మక నియోజకవర్గాల వివరాలను ఒకసారి పరిశీలిస్తే పలనాడు జిల్లాలోని పెదకూరపాడు, వినుకొండ ,గురజాల , మాచర్ల ( Pedakurapadu, Vinukonda, Gurajala, Macharla )అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశం లేదని గుర్తించింది.

అలాగే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ,తిరుపతి నియోజకవర్గం సమస్యత్మక ప్రాంతాలుగానే గుర్తించింది.ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్ , చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు , అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించింది.ఈ నియోజకవర్గాల్లో ఘర్షణలు, అల్లర్లు జరిగే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్( 100% web casting ) ను ఏర్పాటు చేయనున్నారు.
సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు, రాష్ట్ర పోలీసులను భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించనున్నారు.జిల్లా కలెక్టర్లు లేదా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ( Assembly , Lok Sabha elections )ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని భద్రత ఏర్పాట్లు చేస్తూ, ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో హింసాత్మక ఘటనలు జరిగాయి.వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఆయన పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే.