ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు.ఈ మేరకు నిన్న ఎన్నికల ప్రచారానికి స్వల్ప విరామం ఇచ్చిన ఆయన ఇవాళ్టి నుంచి ప్రచారాన్ని చేపట్టనున్నారు.
వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ఇవాళ కూడా మూడు చోట్ల జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా నరసాపురం, క్రోసూరు మరియు పామూరులో ఏర్పాటు చేస్తున్న సభల్లో పాల్గొననున్నారు.
ముందుగా నరసాపురంకు వెళ్లనున్న జగన్ తరువాత క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదేళ్లలో చేసిన అభివృద్ధితో పాటు అందించిన సంక్షేమాన్ని జగన్ ప్రజలకు వివరించనున్నారు.







