వైసీపీ తాజాగా మేనిఫెస్టోను( YCP Manifesto ) విడుదల చేయగా ఈ మేనిఫెస్టో విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.మరీ అద్భుతంగా మేనిఫెస్టో లేదని రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి సంచలన హామీలను జగన్( CM Jagan ) ప్రకటిస్తారని భావిస్తే అలాంటి హామీలను ప్రకటించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అయితే జగన్ మాత్రం అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ప్రకటించడం జరిగింది.
వైసీపీ మేనిఫెస్టో తర్వాత మొదటి సర్వే వెలువడగా ఈ సర్వేలో వైసీపీ 149 స్థానాలలో విజయం సాధిస్తుందని తేలింది.149 స్థానాలలో విజయం సాధించడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే ఏపీ ఓటర్లు( AP Voters ) వైసీపీ వైపే ఉన్నారని ఈ సర్వేతో మరోసారి ప్రూవ్ అయింది.2019 మ్యాజిక్ ను వైసీపీ రిపీట్ చేస్తుందని ఈ సర్వే చెబుతుండటం నెటిజన్లను ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
ఆంధ్రా లైవ్ న్యూస్( Andhra Live News ) అనే మీడియా సంస్థ ఈ సర్వే వివరాలను వెల్లడించడం జరిగింది.కూటమి కేవలం 26 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఈ సర్వే పేర్కొనడం కూటమి నేతలకు కూడా షాక్ అనే సంగతి తెలిసిందే.రాయలసీమలో రెండు మూడు సీట్లు కూటమికి పెరగడం మినహా పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది.
వైసీపీ( YCP ) మాత్రం వెలువడుతున్న సర్వే ఫలితాలతో ఒకింత సంతోషంగా ఉంది.
మరోసారి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ, జనసేన పార్టీల భవిష్యత్తు ముగిసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ తమ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే పథకాలు రాష్ట్రంలో కొనసాగుతాయని వెల్లడిస్తుండటం గమనార్హం.వైసీపీ సరైన వ్యూహాలతోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని సమాచారం అందుతోంది.
వైసీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందేమో చూడాల్సి ఉందని తెలుస్తోంది.వైసీపీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోంది.
వైసీపీ సులువుగా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.