బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1వ తేదీ నా ఉదయం 9-00 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన కర్నార్ మీటీంగ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కోరారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కార్నర్ మీటీంగ్ కు జనసమీకరణ లక్ష్యం నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకిచ్చిన టార్గెట్ ప్రకారం జనసమీకరణ చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్ల ను ఓట్లు అభ్యర్థించి మన కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కార్యకర్తలను వారు కోరారు.కార్నర్ మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు తో పాటు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరవుతున్నందున కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సభ్యులతో పాటు వివిధ మండల కమిటీల అద్యక్షులు కమిటీల సభ్యులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొని జనసమీకరణ చేసి కార్నర్ మీటీంగ్ ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాలోత్ రాంచందర్ నాయక్, నాయకులు బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, రాంచందర్ నాయక్, రావుల ముత్యం రెడ్డి, మేడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు