రైతులు ఏ పంటను సాగు చేసిన యాజమాన్య పద్ధతులను తెలుసుకొని, పంటకు సంబంధించి కొన్ని మెళుకువలు పాటిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందెందుకు అవకాశం ఉంటుంది.సొరకాయ పంట( Bottle Gourd Crop ) సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలో తెలుసుకుందాం.
సొరకాయ సాగుకు నీరు ఇంకిపోయే నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి.లవణ శాతం ఎక్కువగా ఉండే నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు పంట సాగుకు అనుకూలంగా ఉండవు.
![Telugu Bottle Gourd, Bottlegourd, Cattle Manure-Latest News - Telugu Telugu Bottle Gourd, Bottlegourd, Cattle Manure-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/methods-to-be-followed-to-increase-the-yield-in-the-bottle-gourd-crop-detailsd.jpg)
ఇక వేసవికాలంలో( Summer ) నేలను లోతు దుక్కులు దున్నడం వల్ల నేల నుంచి వివిధ రకాల బ్యాక్టీరియా లేదంటే శిలీంద్రాలు పంటను ఆశించలేవు.పైగా కలుపు సమస్య కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.దీంతో చీడపీడల వ్యాప్తి పెద్దగా ఉండదు.ఇక ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) వేసి పొలాన్ని కలియ దున్ని, నేల వదులుగా అయ్యేలా దమ్ము చేసుకోవాలి.
ఇక పొలంలో ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా తొలగించాలి.తీగ జాతి కూరగాయలను ఎప్పుడు పై పందిరి లేదంటే అడ్డు పందిరి పద్ధతిలో సాగు చేయాలి.
బోదెల ద్వారా నేల మీద సాగు చేస్తే చీడపీడల, తెగుళ్ల సమస్య( Pests ) చాలా ఎక్కువ.సకాలంలో గుర్తించలేం, తొలిదశలో అరికట్టలేం కాబట్టి ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.
![Telugu Bottle Gourd, Bottlegourd, Cattle Manure-Latest News - Telugu Telugu Bottle Gourd, Bottlegourd, Cattle Manure-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/methods-to-be-followed-to-increase-the-yield-in-the-bottle-gourd-crop-detailsa.jpg)
సొరకాయ పంటను పై పందిరి లేదంటే అడ్డుపందిరి పద్ధతిలో మాత్రమే సాగు చేయాలి.మొక్కల మధ్య కనీసం మూడు అడుగుల దూరం మొక్కల వరుసల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే వ్యాప్తి పెద్దగా ఉండదు.పంట నాణ్యత బాగా ఉండాలంటే పంట పూత, పిందె, కాయ దశలలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా నీటి తడులు అందించాలి.
పంటకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడం మంచిది.డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీరు వృధా కాకుండా పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది.