జనసేన పార్టీకి( Janasena party ) స్వల్ప ఊరట లభించింది.జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు గ్లాస్ గుర్తును ఎన్నికల సంగం కేటాయించింది.పేరా 10బీ ( Para 10b ) ప్రకారం జనసేన అభ్యర్థి పోటీలో లేనట్లయితే ఫ్రీ సింబల్ అవుతుందని ఈసీ( EC ) స్పష్టం చేసింది.
అటువంటి స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే వారికి కేటాయించే అవకాశం ఉంటుంది.అయితే ఏపీలో గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దని జనసేన కోరింది.
కానీ జనసేన చేసిన వినతిపై సీఈసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.