విద్యార్ధి వీసాలకే మా తొలి ప్రాధాన్యత : భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి

విద్యార్ధి వీసాలకే( Student Visas ) అమెరికా అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టి.( Eric Garcetti ) ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ .

 America Puts High Priority On Student Visas Says Us Envoy Eric Garcetti Details,-TeluguStop.com

వ్యక్తుల మధ్య సంబంధాలు జీవితకాలం కొనసాగుతాయన్నారు.ఈ ఏడాది భారతీయ విద్యార్ధుల( Indian Students ) నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులను స్వీకరించాలనే లక్ష్యం దిశగా సాగుతున్నామని గార్సెట్టి పేర్కొన్నారు.

భారతీయుల వీసా నిరీక్షణ సమయాన్ని తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) తనను కోరిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.అమెరికా చరిత్రలో ఓ రాయబారితో అధ్యక్షుడు ఇలా చెప్పడం ఇదే మొదటిసారని తాను భావిస్తున్నట్లుగా గార్సెట్టి పేర్కొన్నారు.

నిరీక్షణ సమయం తగ్గితే.ఎక్కువ మంది భారతీయులు అమెరికా రావాలనే కోరిక నెరవేరుతుందన్నారు.

భారత్ – అమెరికా సంబంధాలలో విద్యది కీలకపాత్రగా ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు.ఇరు దేశాలను, ఇరు ప్రజలను విద్యార్ధుల మార్పిడి కంటే ఎక్కువగా ఏదీ కలపలేదని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

అమెరికా .భారతీయుల జీవితంలో భాగమైందని .భారతదేశానికి వచ్చే అమెరికన్లకు వారి జీవితంలో భారత్ భాగమవుతుందని గార్సెట్టి ఆకాంక్షించారు.ఇది ఇరుదేశాల మధ్య శక్తివంతమైన అనుబంధంగా ఆయన పేర్కొన్నారు.

Telugu America, Eric Garcetti, India, Indian, Joe Biden, Visas, Envoyeric, Visa

గతేడాది అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్ధుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారని గార్సెట్టి చెప్పారు.రాబోయే రోజుల్లో అమెరికా( America ) వచ్చే విద్యార్ధులందరికీ వసతి కల్పిస్తామని .అపాయింట్‌మెంట్ల ద్వారా అమెరికా వీసాలు( US Visas ) పొందాలని ఆయన సూచించారు.భారతీయుల టూరిస్ట్ వీసా వెయిటింగ్ సమయాన్ని కూడా తగ్గించడంపై ఎరిక్ గార్సెట్టి ప్రస్తావించారు.

కొత్త పర్యాటక వీసాల వెయిటింగ్ టైమ్‌ని 75 శాతం తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు.

Telugu America, Eric Garcetti, India, Indian, Joe Biden, Visas, Envoyeric, Visa

అమెరికాలో భారతీయ విద్యార్ధుల వరుస మరణాలపైనా గార్సెట్టి స్పందించారు.భారతీయ విద్యార్ధుల శ్రేయస్సుపై అమెరికా శ్రద్ధ వహిస్తుందని.మీ పిల్లలు మా పిల్లలేనని గార్సెట్టి విద్యార్ధుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ఈ ఏడాది జనవరి నుంచి నేటీ వరకు అమెరికాలో పది మంది వరకు భారత సంతతి, భారతీయ విద్యార్ధులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube