పోర్చుగీసులో( Portuguese ) స్థిరపడిన భారత సంతతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పోర్చుగీసు పౌరసత్వం పొందిన తర్వాత భారతీయ పాస్‌పోర్టులను రద్దు చేయబడిన0 గోవా, డమన్ అండ్ డయ్యూ వ్యక్తులకు “revocation order” జారీ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.
పాస్‌పోర్ట్ అవసరాల కారణంగా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి గతంలో అనర్హులుగా వున్న చాలామందికి ఈ చర్య ఉపశమనం కలిగించింది.
ఏప్రిల్ 4 నాటి మెమోరాండం ప్రకారం.
పోర్చుగీస్ పౌరసత్వాన్ని పొందిన భారతదేశంలోని ఒకప్పటికీ పోర్చుగీస్ భూభాగాలకు చెందిన భారతీయ పౌరులకు సరెండర్ సర్టిఫికేట్‌కు బదులుగా రివోకేషన్ సర్టిఫికేట్‌ను ప్రత్యామ్నాయ పత్రంగా అంగీకరించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని పేర్కొంది.ఓసీఐ కార్డు( OCI card ) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి సరెండర్ సర్టిఫికేట్ తప్పనిసరి నిబంధన ప్రతిబంధకంగా మారింది.
ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్ అనేది విదేశీ పౌరులుగా వున్న భారత సంతతికి చెందిన వ్యక్తులకు భారత ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్ట్ లాంటి పత్రం.జనవరి 26, 1950 తర్వాత భారతదేశ పౌరులుగా వున్నట్లయితే .వారిని భారతదేశ విదేశీ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది.దీని వల్ల భారతదేశానికి వెళ్లడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు( Indians ) ఓసీఐ కార్డు ద్వారా జీవిత కాలం పాటు ఎలాంటి వీసా లేకుండా భారత్‌కు రావొచ్చు.ఓసీఐ కార్డున్న వారు ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ భూముల కొనుగోలు తప్ప మిగతా అన్ని హక్కులూ పొందేందుకు వెసులుబాటు వుంది.
కాగా.ఓసీఐ కార్డుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ( Pramod Sawanth )హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) , ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఎంతోమంది గోవా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి .ఓసీఐ కార్డులను పొందేందుకు వీలు కలిపిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.పోర్చుగీస్ చట్టం ప్రకారం డిసెంబర్ 19, 1961కి ముందు గోవాలో జన్మించిన వ్యక్తులు , తర్వాతి రెండు తరాలు పోర్చుగీస్ పౌరులుగా నమోదు చేసుకునే అవకాశం వుంది.
యూకే, ఈయూ వంటి దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందించే పోర్చుగీస్ పాస్‌పోర్టుతో చాలా మంది గోవా వాసులు విదేశాలలో మెరుగైన ఉపాధి, విద్యా అవకాశాలు పొందుతున్నారు.