పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అయితే రష్మీక మందాన ఆ రికార్డ్ ను క్రియేట్ చేస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందాన( Rashmika Mandana ) ప్రస్తుతం ఈమె చేస్తూన్న పుష్ప 2 ( Pushpa 2 )సినిమా మీద మంచి హైప్ అయితే ఉంది.ఇక ఈ సినిమాతో ఆమె మరోసారి భారీ సక్సెస్ ను సాదించబోతున్నట్టుగా తెలుస్తుంది.

 If Pushpa 2 Is A Super Hit, Will Rashmika Mandana Create That Record , Pushpa 2,-TeluguStop.com

ఇక ఆమె ఖాతాలో ఇప్పటికే రెండు పాన్ ఇండియా సూపర్ డూపర్ సక్సెస్ లు ఉండడం విశేషం.

ఇక పుష్ప సినిమాతో మొదటిసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్న రష్మిక ఆ సినిమా తర్వాత అనిమల్ సినిమాతో ( Animal movie )భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉంది.అయితే ఈ సినిమాతో కనక మంచి సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో వరుసగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోయిన్ గా కూడా తను సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది.

అయితే పుష్ప 2 సినిమా మేకర్స్ ఈ సినిమాకి 1000 కోట్ల వరకు కలెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలియజేయడం విశేషం.

ఇక ఇలాంటి క్రమంలో రష్మిక మందాన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే తన రెమ్యూనరేషన్( Remuneration ) కూడా భారీగా పెంచే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు పాన్ ఇండియాలో మూడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరు లేకపోవడంతో ఇక ఈ సినిమాతో ఆ ఫీట్ ని అందుకోవాలని రష్మీక ప్రయత్నం అయితే చేస్తుంది.మరి ఆమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube