పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అయితే రష్మీక మందాన ఆ రికార్డ్ ను క్రియేట్ చేస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందాన( Rashmika Mandana ) ప్రస్తుతం ఈమె చేస్తూన్న పుష్ప 2 ( Pushpa 2 )సినిమా మీద మంచి హైప్ అయితే ఉంది.

ఇక ఈ సినిమాతో ఆమె మరోసారి భారీ సక్సెస్ ను సాదించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఆమె ఖాతాలో ఇప్పటికే రెండు పాన్ ఇండియా సూపర్ డూపర్ సక్సెస్ లు ఉండడం విశేషం.

"""/" / ఇక పుష్ప సినిమాతో మొదటిసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్న రష్మిక ఆ సినిమా తర్వాత అనిమల్ సినిమాతో ( Animal Movie )భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉంది.

అయితే ఈ సినిమాతో కనక మంచి సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో వరుసగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోయిన్ గా కూడా తను సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది.

అయితే పుష్ప 2 సినిమా మేకర్స్ ఈ సినిమాకి 1000 కోట్ల వరకు కలెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలియజేయడం విశేషం.

"""/" / ఇక ఇలాంటి క్రమంలో రష్మిక మందాన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే తన రెమ్యూనరేషన్( Remuneration ) కూడా భారీగా పెంచే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు పాన్ ఇండియాలో మూడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరు లేకపోవడంతో ఇక ఈ సినిమాతో ఆ ఫీట్ ని అందుకోవాలని రష్మీక ప్రయత్నం అయితే చేస్తుంది.

మరి ఆమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి వచ్చాక రిటర్న్ చేస్తున్నారా? ఇకపై బాదుడే