తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సామాన్య నటుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి( Chiranjeevi ) ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు.ఇక ప్రస్తుతం అయన వరుస సినిమాలు చేస్తు ఇండస్ట్రీ లో యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధిస్తున్నాయి.ఇక చిరంజీవి తప్పకుండా చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలు కూడా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు… ఇక ఇదిలా ఉంటే చిరంజీవి 2009 లో ప్రజా రాజ్యం పార్టీ పెట్టీ పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే…ఇక అక్కడ ఆయన మనుగడ ఎక్కువ కాలం నిలవలేదు.
దాంతో వెంటనే మళ్ళీ ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ కి రీ ఎంట్రి( Re Entry ) ఇచ్చాడు.ఇక అందులో భాగంగానే వి వి వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా( Khaidi No.150 ) చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఖైదీ నెంబర్ 150 సినిమాలో విలన్ పాత్ర( Villain Role ) కోసం మొదటగా ఒక స్టార్ హీరోని సంప్రదించారనే విషయం సోషల్ మీడియా లో తెగ వైరల్ అయింది.ఆయన ఎవరు అంటే తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్…
ఈయనను ఆ సినిమా లో విలన్ గా తీసుకోవాలని భావించారు.అయినప్పటికీ గోపీచంద్( Gopichand ) మాత్రం అప్పుడు లౌక్యం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకొని మంచి పొజిషన్ లో ఉన్నాడు.కాబట్టి ఆయన ఈ క్యారెక్టర్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
దాంతో ఆ క్యారెక్టర్ ను వేరే యాక్టర్ చేత చేయించి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి కీలకపాత్ర వహించాడు.ఇక మొత్తానికైతే ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయాడు.