యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ప్రజల గోడు తెలుసుకొని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడడానికి ముందుకు వచ్చానని బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) అన్నారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు సూర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ( Narendra Modi )ని దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు.
పురాతన రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేసి,కేంద్రం ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.నియోజకవర్గంలోని చర్లగూడెం రిజర్వాయర్ పూర్తి చేయించి రైతులకు తాగు,సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గడపగడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించి,దేశానికి మోడీ ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటేసి భువనగిరిలో బూర నర్సయ్య( Boora Narsaiah Goud )ని గెలిపించాలని అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దోనూరి వీరారెడ్డి,బచ్చనబోయిన దేవేందర్,దూడల భిక్షం గౌడ్,దాసరి మల్లేశం,వనం ధనుంజయ,శ్రీనివాస్ రెడ్డి, ఓబిసి మోర్చా కార్యదర్శి జక్కలి రాజు యాదవ్, తంగేళ్ల సత్తయ్య,వంగరి రఘు,భాస్కర్,నరసింహ, బద్దం యాదయ్య,భిక్షం తదితరులు పాల్గొన్నారు.