ఒక సినిమాని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీసి సక్సెస్ చేయగల సత్తా ఉన్న దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.అందులో రాజమౌళి ఒకరు.
ఈయన చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో అతన్ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టింది.ఇక ఎప్పుడు తెలుగులోనే కాకుండా పాన్ ఇండియాలో కూడా నెంబర్ వన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

ఇక దాంతో ఇప్పుడు పాన్ వరల్డ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న మరొక దర్శకుడు తేజ( Teja ).లవ్ స్టోరీస్ ని ఈయన తీసినంత అందంగా మరెవరు తీయలేరు అనేంత మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.అలాంటి తేజ గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస ప్లాప్ లను ఎదుర్కొంటూ వస్తున్నాడు.మధ్యలో ‘నేనే రాజు నేనే మంత్రి( Nene Raju Nene Mantri )’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కూడా ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది…

అయితే తేజ రాజమౌళి( Rajamouli ) ఇద్దరి సినిమాలు చూసే ప్రేక్షకులందరూ వీళ్లిద్దరి సినిమాలకి మధ్య తేడాను పోలుస్తూ వీళ్ళిద్దరి సినిమాలు చూడటానికి చాలా బాగున్నప్పటికీ ఒక్క విషయం లో మాత్రం ఇద్దరూ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అది ఏంటి అంటే తేజ సినిమాల్లో హీరో చాలా వీక్ గా కనిపించి లాస్ట్ లో స్ట్రాంగ్ అవుతాడు.కానీ రాజమౌళి సినిమాలో హీరో మొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూనే తనకంటే స్ట్రాంగ్ ఉన్న విలన్ ను ఎదుర్కొంటూ భారీ ఫైట్లు చేస్తూ ముందుకు సాగుతాడు.ఇక తేజ సినిమా విషయంలో హీరో ఫైట్లు ఎక్కువగా చేయకుండా కామన్ మ్యాన్ లాగా ఉంటాడు.
ఇక వీళ్లిద్దరు హీరోల క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో ఇలాంటి తేడాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.