గుంటూరు కారం, హనుమాన్ ( Guntur karam , Hanuman )సినిమాలు ఒకేరోజు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలలో గుంటూరు కారం మొదట హవా చూపించినా హనుమాన్ మూవీ లాంగ్ రన్ లో ప్రభావం చూపించింది.
హనుమాన్ మూవీ ఏకంగా 150 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శించబడగా గుంటూరు కారం మూవీ మాత్రం 5 సెంటర్లలో మాత్రమే 50 రోజుల పాటు ప్రదర్శించబడిందని సమాచారం అందుతోంది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్టార్ స్టేటస్ కంటే కంటెంట్ ముఖ్యమని ఈ సినిమాతో మరోమారు ప్రూవ్ అయింది.
ఒకప్పుడు మహేష్( mahesh ) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జా( Teja Sajja ) ఇప్పుడు మహేష్ సినిమాకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదగడం తేజ సజ్జా ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.రాబోయే రోజుల్లో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

తేజ సజ్జా ఇప్పుడు కూడా రెమ్యునరేషన్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలే ముఖ్యమని చెబుతుండటం గమనార్హం.రాబోయే రోజుల్లో తేజ సజ్జా నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.తేజ సజ్జా ఈ జనరేషన్ లో స్టార్ స్టేటస్ ను అందుకునే సత్తా ఉన్న నటుడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తేజ సజ్జా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాల్సి ఉంది.

జై హనుమాన్ ( Jai Hanuman )లో తేజ సజ్జా పాత్ర పరిమితం అయినా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలోనే తేజ సజ్జా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.తేజ సజ్జాను టాలీవుడ్ స్టార్స్ సైతం ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.తేజ సజ్జా రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందని తెలుస్తోంది.తేజ సజ్జా డేట్స్ కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారని భోగట్టా.