ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ( Telangana BJP Election Committee ) సమావేశం అయింది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీ.
బీజేపీ ప్రత్యేక దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో భారత్ మండపం వేదికగా నేతలు సమావేశం అయ్యారు.
అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు.
కాగా ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి,( Kishan Reddy ) ఇంఛార్జ్ సునీల్ బన్సల్,( Sunil Bansal ) డీకే అరుణ, బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ ఇతరులు హాజరయ్యారు.సెగ్మెంట్ కు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు.ఈ క్రమంలో కమిటీ రూపొందించే జాబితాపై పార్లమెంటరీ బోర్డులో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.