ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి( BRS Party ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి.అసలు తెలంగాణలో ఉనికే లేదన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బాగా బలోపేతం కావడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దూకుడుగా వ్యవహరించడం తదితర కారణాలతో కాంగ్రెస్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది.
ఇక అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్ లో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారు చాలామంది కాంగ్రెస్ లోకి క్యూ కడుతుండడం, బీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( Greater Hyderabad Municpal Corporation ) పరిధిలోని కీలక నాయకులు చాలామంది ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతుండడం, వరుస వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలంతా రేవంత్ రెడ్డిని కలుస్తుండడం వంటివి బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి( Mayor Gadwal Vijayalakshmi ) అకస్మాత్తుగా రేవంత్ రెడ్డిని కలిశారు.
అయితే ఈ సమావేశం పూర్తిగా అధికారికమే అంటూ విజయలక్ష్మి ప్రకటించినా, ఆమె కాంగ్రెస్ లోకి( Congress ) వెళ్లే ఆలోచనతో ఉన్నారని , అందుకే రేవంత్ రెడ్డిని కలిశారనే ప్రచారం జరుగుతోంది.మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్( Baba Fasiuddin ) సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు.ఈయనకు ముస్లిం కార్పొరేటర్లలో మంచి పట్టు ఉంది .గ్రేటర్ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.మరి కొంత మంది కార్పొరేటర్లు హాజరు కాలేదు.దీంతో వారంతా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది.ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో పట్టు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగానే అవిశ్వాస తీర్మానాలు పెట్టి బిఆర్ఎస్ చైర్మన్ లను దింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటికే చాలా మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిపోయి అవిశ్వాస తీర్మానాలు పెట్టి చైర్మన్ లను దింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దీంతో ఒక్కో మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడుతూ వస్తోంది.
తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్( Bonthu Ram Mohan ) రేవంత్ రెడ్డిని కలవడం తో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరే ఆలోచనతో ఉన్నట్లుగా ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తూ ఉండడం వంటివి బీఆర్ఎస్ కు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చూస్తే గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ కీలక నాయకులంతా కాంగ్రెస్ కండువా కప్పుకునేలా కనిపిస్తున్నారు.