సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ లో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే.ఈ క్రమంలో విద్యార్థిని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కుటుంబసభ్యులతో పాటు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస బలవన్మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలని తెలిపారు.విద్యార్థుల బలవన్మరణాలపై నిరసనగా రేపు హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ ముందు మహాధర్నా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.