మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో వినిపించిన పేరు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా( Prashant Verma, Teja Sajja ).ఇటీవలె హనుమాన్( Hanuman ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే.సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ప్రస్తుతం కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలను వెనక్కు నెట్టి హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్న కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.ఇప్పటి వరకు హనుమాన్ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతి భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా హనుమాన్ నిలిచింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజా హనుమాన్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.
మేము హనుమాన్ సినిమా కోసం రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డాము.ఈ రెండున్నర ఏళ్లలో నా వద్దకు ఏకంగా 70 నుంచి 75 సినిమా ఆఫర్లు నా వద్దకు వచ్చాయి.కానీ నేను హనుమాన్ సినిమా తర్వాతే ఏ సినిమా అయినా అంటూ వాటన్నింటిని తిరస్కరించాను అని చెప్పుకొచ్చాడు తేజా.
అయితే హీరో తేజ సజ్జా 75 సినిమాలు కాదని హనుమాన్ సినిమా కోసం రెండున్నర ఏళ్లు కష్టపడినందుకు ప్రతిఫలం ఆ స్థాయిలోనే లభించింది.పది సినిమాలు చేసినా దక్కని గుర్తింపు గౌరవం కేవలం హనుమాన్ సినిమాతో తేజకి దక్కింది అనడంలో సందేహం లేదు.
హనుమాన్ సినిమా తేజ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అయ్యింది.