టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్.
( Salaar ) తాజాగా ఈ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
కోట్ల బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదల అయ్యి అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి, సలార్ 2,రాజాసాబ్ వంటి సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.వీటిలో కల్కి సినిమాకు( Kalki Movie ) సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ కల్కి కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే కల్కి పార్ట్-1 కోసం ఏకంగా 3 క్లయిమాక్స్ రెడీ చేస్తున్నారట.అవును ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా మొదటి భాగాన్ని ఎలా ముగించాలనే అంశంపై ఇంకా డిస్కషన్లు సాగుతున్నాయంట.
దీనికి సంబంధించి 3 రకాల క్లైమాక్స్( Kalki Climax ) అనుకున్నారట.ఏది ఫైనల్ చేస్తారో చూడాలి మరి.అయితే ఇలా కేవలం ప్రభాస్ సినిమాలకే ఎక్కువగా ఇలా జరుగుతోంది.
బాహుబలి టైమ్ లో కూడా పార్ట్-1కు ముగింపునిచ్చే విషయంలో మల్లగుల్లాలు పడినట్టు రాజమౌళి గతంలో వెల్లడించాడు.ఇక తాజాగా వచ్చిన సలార్ పార్ట్-1 క్లైమాక్స్ కోసం కూడా చాలా వర్క్ చేసినట్టు, 2-3 వెర్షన్లు రాసుకున్నట్టు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు.ఇప్పుడు కల్కి పార్ట్-1 కు కూడా ఈ మేథోమథనం తప్పడం లేదు.
నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో తెరకెక్కుతోంది కల్కి సినిమా.కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు.
అతడి పాత్ర పరిచయంతోనే కల్కి పార్ట్-1 ముగుస్తుందని, అదే టైమ్ లో పురాణాలకు ముడిపెడుతూ, క్లయిమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారని తెలుస్తోంది.