Apple Tea : అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ అద్భుతమైన టీ ని ట్రై చేయండి..!

ముఖ్యంగా చెప్పాలంటే ఆపిల్ పండు( Apple ) ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలామందికి తెలుసు.రోజు ఒక ఆపిల్ పండు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా దూరం అవ్వాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 Health Benefits Of Apple Cinnamon Cloves Teahealth Benefits Of Apple Cinnamon C-TeluguStop.com

ఆ పండు ఎంత మంచిదో, దాని గింజలు అంతే ప్రమాదమని చెబుతున్నారు.వాటిని పొరపాటున కూడా నోట్లో వేసుకోకూడదు.

ఇంకా చెప్పాలంటే ఆపిల్ ని పండులానే కాకుండా టీ లా కూడా తాగవచ్చని చాలామందికి తెలియదు.ఇది వెయిట్ లాస్ కు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి, రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేయడం నుంచి కొలెస్ట్రాల్( Cholestrol ) ను నియంత్రించడం వరకు ఆపిల్స్ అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

Telugu Apple Tea, Tips, Telugu-Telugu Health

ఆపిల్ ముక్కలు బ్లాక్ టీ మిశ్రమంతో కలిపి చేసుకోవచ్చు.దాల్చిన చెక్క, లవంగాలతో రుచిగా ఉంటుంది.వేడిగా లేదా చల్లగా తాగిన పర్వాలేదు.

ఈ పానీయంతో బరువు త్వరగా తగ్గవచ్చు.ఆపిల్ ముక్కలను నీటిలో ఉడకబెట్టడం వల్ల ఆపిల్ టీ( Apple Tea ) లో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఆపిల్ టీ చేయడానికి ఒక ఆపిల్, మూడు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టీ బ్యాగులు, దాల్చిన చెక్క లేదా లవంగం పొడి ఉంటే చాలు.

Telugu Apple Tea, Tips, Telugu-Telugu Health

ఒక పాత్రలో నీటిని పోసి దానిలో నిమ్మరసం కలపాలి.తర్వాత స్టవ్ వెలిగించి అది మరుగుతున్న సమయంలో ఆపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వేయాలి.ఆపిల్ ముక్కలను తోలుతూనే అందులో వేయాలి.ఐదు నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించాలి.చివరగా దాల్చిన చెక్క లేదా లవంగాల పొడి( Cloves Powder ) నీ జోడించాలి.తర్వాత టీ బ్యాగులు వెయ్యాలి.

యాపిల్ ముక్కలను పారేయకుండా తినవచ్చు.దాల్చిన చెక్క శరీరాన్ని నిర్వీకరణ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే శరీరంలో మంటతో పోరాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube