Actress Arya Babu: భర్త చేతిలో దారుణంగా మోసపోయిన ప్రముఖ బుల్లితెర నటి ఆర్య.. ఏం జరిగిందంటే?

మలయాళ బుల్లితెర నటి ఆర్య( Actress Arya ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట బుల్లితెర నటిగా కెరియర్ ను ప్రారంభించినప్పటికీ వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

 Bigg Boss Contestant Arya Babu Opens About Her Separation-TeluguStop.com

మలయాళ బిగ్‌బాస్‌ సీజన్‌-2లో( Bigg Boss Malayalam Season 2 ) కంటెస్టెంట్‌గా పాల్గొంది.వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది.

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్‌తో( Rahul Suseelan ) విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

Telugu Arya Babu, Aryababu, Bigg Boss, Biggboss, Malayalamarya, Rahul Suseelan-M

ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై ( Divorce ) స్పందించింది ఆర్య.ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ.ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను.వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్‌కి పంపాడా అనే అనుమానం ఉంది.ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి.నాకు ఒక కుమార్తె ఉంది.

మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు.బిగ్‌బాస్‌ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు.

నాకు అక్కడ బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు.నేను హౌస్‌ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు.

Telugu Arya Babu, Aryababu, Bigg Boss, Biggboss, Malayalamarya, Rahul Suseelan-M

కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను అని తెలిపింది ఆర్య. బిగ్ బాస్( Bigg Boss ) నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశాను.కానీ లిఫ్ట్ చేయలేదు.దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే.అతను ఫోన్ తీయకపోవడంతో నేను అతని సోదరికి ఫోన్ చేశాను.

ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది.అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది.

దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది.కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు.

కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తాను అంటూ తన కోపాన్ని బయటపెట్టింది ఆర్య. ఆ సమయంలో అతను దుబాయ్‌లో ఉన్నందున కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube