GPSని గుడ్డిగా నమ్మి చెక్క వంతెనపై చిక్కుకుపోయిన థాయ్ మహిళ..?

ప్రయాణాలు చేసేటప్పుడు గుడ్డిగా టెక్నాలజీ( Technology ) పై ఆధారపడితే చిక్కుల్లో పడక తప్పదు.ఈ విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమైంది.

 Thai Woman Gets Stuck In The Middle Of Bridge Claims Gps Told Her To Cross It-TeluguStop.com

అయినా కొందరు ప్రజలు వాటి మీద ఆధారపడి ముందుకు సాగుతున్నారు.తాజాగా ఒక మహిళ ఇలానే డ్రైవ్ చేసి చివరికి పెద్ద చిక్కుల్లో పడింది.

థాయ్‌లాండ్‌కు చెందిన ఈ మహిళ తన కారును డ్రైవింగ్ చేస్తూ చివరికి ప్రజలు నడవడానికి మాత్రమే నిర్మించిన చెక్క వంతెనపై చిక్కుకు పోయింది.ఆమె తన GPSని అనుసరిస్తోంది, అది ఆమెను అలా వెళ్ళమని సూచించిందట.

ఈ వంతెన యోమ్ నదిపై చాలా పొడవుగా ఉంది.ఆమె కారు వంతెన మధ్యలో ఇరుక్కుపోయింది, ఎందుకంటే చక్రాలలో ఒకటి రంధ్రంలో పడిపోయింది.

ఆమె కారును ఏమాత్రం కదల్చలేకపోయింది.చివరికి చాలా భయపడి, సహాయం అడగడానికి కారు దిగింది.

Telugu Car Stuck, Gps Mishap, Error, Rescue, Thailand, Wooden Bridge, Yom River-

సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఏం జరిగిందో చూసి రెస్క్యూ టీమ్‌( Rescue Team )కు ఫోన్ చేశాడు.వారు వచ్చి కారు బద్దలు కాకుండా వంతెనపై నుంచి తరలించడానికి ప్రయత్నించారు.అంతేకాకుండా ఆమెకు చివాట్లు కూడా అటించారు.అయితే తాను వేరే జిల్లాకు చెందిన నివాసిని అని, సంగ్ మెన్‌లోని తన స్నేహితుడిని చూసేందుకు వెళ్తున్నానని ఆ మహిళ చెప్పింది.

ఆ ప్రాంతం పెద్దగా తెలియదు కాబట్టి తన GPSని ఉపయోగించి మార్గాన్ని కనుగొన్నానని పేర్కొంది.ఆమె స్నేహితుడు తన ఇంటి లొకేషన్‌ను ఆమెకు షేర్ చేశాడు.అయితే వంతెనపై( Wooden Bridge ) దృష్టి పెట్టలేదని, ఇది కార్లకు సరిపోయేంత బలంగా ఉందని తాను భావించినట్లు చెప్పింది.కానీ చివరికి ఇది పెద్ద సమస్య అవుతుందని అందరికీ, ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నట్లు చెప్పింది.

Telugu Car Stuck, Gps Mishap, Error, Rescue, Thailand, Wooden Bridge, Yom River-

రెస్క్యూ టీం కారును సురక్షితంగా వంతెనపై నుంచి దింపింది.వచ్చేసారి మరింత జాగ్రత్తగా ఉండాలని, GPSని గుడ్డిగా నమ్మవద్దని కూడా వారు మహిళకు చెప్పారు.బ్రిడ్జి చాలా పాతదని, కూలిపోయి ఉంటే ప్రాణాలు ఏ గాల్లో కలిసిపోయి ఉండేవని హెచ్చరించారు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube