పారదర్శక పోలుసు పురుగులు ద్రాక్ష పంట( Grape crop )తో పాటు మామిడి, బొప్పాయి, అవోకాడో, నిమ్మ జాతి పంటలపై దాడి చేస్తాయి.ఇవి ఆహారం తీసుకునేటప్పుడు మొక్క కణజాలాల్లోకి ఇంజెక్ట్ చేసే ఒక విషపూరిత లాలాజలం కారణంగా ఆకు కణజాల రూపం మార్పిడి జరుగుతుంది.
ఈ పురుగులు ఆశించడం వల్ల ద్రాక్ష మొక్క కాడలు, పూల గుత్తులు, లేత పండ్లు ప్రభావితం అవుతాయి.ద్రాక్ష మొక్క ఆకులు ద్రాక్ష పండ్లు పసుపుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోకి మారి త్వరగా రాలిపోతాయి.
మొక్క పెరుగుదల మందగిస్తుంది.ఈ పురుగుల ప్రభావం అధికంగా ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంది.
ఈ పురుగులు బాగా వేపుగా ఎదిగే ద్రాక్ష మొక్కలను ఆశిస్తాయి.దట్టమైన పొదలు లేకుండా కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి.ఇక ఈ పురుగులు ఆశించిన కొమ్మలను కత్తిరించాలి.ద్రాక్ష తోటలు ఎప్పుడు అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ద్రాక్ష తోటల చుట్టూ బెండ, తుతూరు బెండ సాగు చేయకూడదు.
సేంద్రీయ పద్ధతి( Organic method )లో ఈ పురుగులను అరికట్టాలంటే.47 డిగ్రీలు, 49 డిగ్రీల వద్ద నీటిలో వరుసగా 15 మరియు 10 నిమిషాల పాటు చేసే చికిత్సలు పురుగులను అరికడతాయి.ఈ పురుగులను అరికట్టేందుకు పరాన్న కందిరీగలను పొలంలో ప్రవేశపెట్టాలి.
వీలైనంతవరకు జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి.అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అప్పుడు రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.
పైరిప్రాక్సీఫెన్( Pyriproxyfen ) ఉండే రసాయనంను 20 రోజుల వ్యవధిలో నాలుగు లేదా ఐదు సార్లు పిచికారి చేయాలి.తెగుళ్లు లేదంటే చీడపీడలు పంటను ఆశిస్తే తొలి దశలోనే అరికట్టాలి.
అప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణుల సూచన.