సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు.అయితే కొంతమందికి అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సరైన విధంగా సద్వినియోగం చేసుకోలేక ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.
అలాగే చాలామంది హీరోయిన్స్ మేము ఇలాంటి పాత్రలైతేనే చేస్తాము బోల్డ్ సన్నివేశాలు చేయము అంటూ కరాకండిగా చెప్పేస్తుంటారు.ఈ విధంగా కొన్ని రొమాంటిక్ సన్ని వేశాలలో నటించలేక ఎంతో మంది హీరోయిన్స్ ఆ సినిమాల నుంచి తప్పకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ విధంగా టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీతో పాటు ఇతర భాషలలో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోయిన్ కేవలం ముద్దు సీన్లలో నటించడం కోసం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ఈమె రెండు సినిమాలలో నటించారు.
అయితే ఆ సినిమాలు రెండు చాలా పద్ధతిగా ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా ఉంది కానీ మూడో సినిమా అవకాశం వచ్చేసరికి ఆ డైరెక్టర్ సినిమా కథ చెప్పేటప్పుడు అందులో ఎలాంటి ముద్దు సీన్స్ లేవు కానీ షూటింగ్ సమయంలో కథలో అలాంటి సన్నివేశాలను పెట్టాల్సి వచ్చింది.
ఈ విధంగా సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా డైరెక్టర్( Director ) ముద్దు సన్నివేశాలలో నటించాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఆ హీరోయిన్ మూడు రోజుల పాటు నేను ఇలాంటి సన్నివేశాలలో నటించను అంటూ చెప్పారట అయితే తప్పనిసరిగా నటించాల్సి ఉందని కథ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ సన్నివేశాలను పెట్టామని డైరెక్టర్ చెప్పడంతో ఆ హీరోయిన్( Heroine ) చేసేదేమీ లేక ఏకంగా సినిమానే మానేసారని తెలుస్తోంది.తమ కుటుంబం మడి ఆచారాలు కలిగి ఉన్నటువంటి కుటుంబమని ఇలాంటివి చేస్తే తన ఫ్యామిలీలో అసలు ఒప్పుకోరు అని చెప్పి ఈమె డైరెక్టర్లను బ్రతిమాలారట అయినప్పటికీ ఆ సన్నివేశాలలో నటించాల్సి ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో చేసేది ఏమీ లేక ఆ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పారు.
ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పకున్నటువంటి ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుని విదేశాలలో స్థిరపడి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిపోయారు.ఇక ఈ విషయం తెలియడంతో హీరోయిన్ చాలా మంచి పని చేసిందని ఆమె సరైన నిర్ణయమే తీసుకుంది అంటూ పలువురు ఈమె గురించి కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించారు.