2024 టార్గెట్.. ఏపీ వ్యాప్తంగా వైఎస్ జగన్ రీజనల్ క్యాడర్ భేటీలు..!!

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) రానున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP ) మరోసారి విజయాన్ని సాధించేందుకు సమాయాత్తం అవుతోంది.

 Target 2024 Ys Jagan Regional Cadre Meetings Across Ap Details, Ap Cm Jagan, 202-TeluguStop.com

ఇందులో భాగంగా కీలక సమావేశాలను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) కీలక నిర్ణయం తీసుకున్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలోని ఐదు రీజియన్ లలో క్యాడర్ మీటింగ్ లను నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.అంతేకాదు నాలుగు నుంచి ఆరు జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పార్టీ సభ్యులు అందరినీ ఏకం చేసి… వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లను గెలిచే విధంగా వారిని సన్నద్ధం చేయడమే సమావేశాల లక్ష్యం.ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు( Regional Cadre Meetings ) ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.విశాఖపట్నంలోని భీమిలి వేదికగా తొలి సమావేశం జరగనుంది.ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా సమావేశాల్లో పాల్గొని రానున్న ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహాంపై పార్టీ క్యాడర్ కు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.ఈ విషయాన్ని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కాగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ కేడర్ సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube