టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున( Nagarjuna ) తాజాగా నటించిన చిత్రం నా సామిరంగ( na Samiranga ).విజయ్ పిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా అలరిస్తున్నాయి.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే హీరో అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించారు.
నా సామిరంగ మీ కెరీర్‌లో వేగంగా పూర్తి చేసుకున్న సినిమా అనుకోవచ్చా? అని ప్రశ్నించగా.నాగ్ స్పందిస్తూ.
షూటింగ్ డేట్ నుంచి మొదలుపెడితే రిలీజ్ డేట్‌కి చిత్రీకరణ వేగంగా జరుపుకున్న సినిమా అనవచ్చు.వర్కింగ్ డేస్‌లో మాత్రం కాదు.
చాలా సినిమాలు 35 రోజుల్లో చేశాము.నా సామిరంగ 72 రోజుల చిత్రీకరణ చేశాం.
నేను 60 రోజులు పని చేశాను.ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.
ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది.
ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం.కీరవాణిగారి( Keeravani ) లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వుండటం మా అదృష్టం.మూడు పాటలు షూటింగ్‌కి ముందే ఇచ్చేశారు.
అలానే ఫైట్ సీక్వెన్స్‌కి కూడా నేపధ్య సంగీతం చేశారు.నేపధ్య సంగీతం పెట్టుకొని ఫైట్ షూట్ చేశాం.
ఇంత ఫాస్ట్‌గా, ఇంత పెద్ద స్కేల్‌లో చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం.ఇందులో ప్రతి పాటా అద్భుతంగా వుంటుంది.
మా సినిమాకి కీరవాణిగారే స్టార్ అని తెలిపారు నాగ్.అనంతరం మహేష్ బాబుతో( Mahesh Babu ) కలసి సినిమా చేసి నాగేశ్వరరావు కృష్ణ గార్ల లెగసీని కొనసాగించాలని గతంలో ఒక ట్వీట్ చేశారు కదా.ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయా? అని యాంకర్ ప్రశ్నించగా.నాగార్జున స్పందిస్తూ ఆయన రాజమౌళి గారితో సినిమా పూర్తి చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలి అని చెప్పుకొచ్చారు నాగార్జున.
ఈ సందర్భంగా నాగార్జున ఇంకా ఎన్నో విషయాలు పంచుకున్నారు.