ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ తీవ్ర కలకలం సృష్టించింది.ఎన్ కౌంటర్ లేని తెలంగాణ సమాజం కావాలని మావోయిస్టులు పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు.
మావోయిస్టులు, ప్రజా సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని మావోయిస్టులో లేఖలో డిమాండ్ చేశారు.
అదేవిధంగా యూఏపీఎస్ కేసులను రద్దు చేయాలన్న మావోయిస్టులు ఎన్ఐఏ దాడులను ఆపాలని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల పేరుతో విడుదలైన ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.