తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల అయింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

 Go Release On Concession Of Pending Traffic Challans In Telangana-TeluguStop.com

జీవో ప్రకారం రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది.ద్విచక్ర వాహనాలతో పాటు త్రీ వీలర్స్ పై 80 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే టీఎస్ ఆర్టీసీ బస్సులపై 90 శాతం, కార్లు మరియు హెవీ వెహికల్స్ పై 60 శాతం రాయితీ వర్తించనుందని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లో పెండింగ్ చలాన్లు చెల్లించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

అయితే గతేడాది కూడా రాయితీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సుమారు 40 రోజుల వ్యవధిలోనే చలాన్ల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.తాజా ఉత్తర్వులతో గత సంవత్సరం తరహాలోనే పెండింగ్ చలాన్లు భారీగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube