తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక అందులో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram ) కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇప్పటికే బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన ఒకటి రెండు సినిమాలతో నిరాశపరిచినప్పటికీ మరోసారి డెవిల్ సినిమా( Devil Movie ) )తో తన ప్రతిభను చూపించుకోవడానికి ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని అద్భుతంగా ఆకట్టుకుంటుంది.కాబట్టి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు ఇప్పటికే మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే నెక్స్ట్ ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే టాకైతే వినిపిస్తుంది.
మరీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.ఇక ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సంయుక్త మీనన్( Samyuktha Menon ) ని తీసుకోవడం విశేషం… ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో కూడా తననే రిపీట్ చేస్తూ మళ్ళీ హీరోయిన్ గా తీసుకోవడం అనేది నిజంగా మంచి విషయం అనే చెప్పాలి… ఇక ఈ హిట్ కాంబో ని రిపీట్ చేస్తూ మరో మంచి సక్సెస్ ని కొట్టడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టి హిట్ పెయిర్ గా నిలుస్తారని సినిమా యూనిట్ మంచి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది…
.