మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.గోబెల్స్ ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
పార్టీ ఓటమి అనేది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని హరీశ్ రావు పేర్కొన్నారు.అధికార పక్షం మానసిక స్థైరాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
పాలు, నీళ్లు ఏంటి అనేది మరో నాలుగు రోజుల్లోనే ప్రజలు గుర్తిస్తారని పేర్కొన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా పోరాటం చేస్తామని వెల్లడించారు.
అలాగే నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన పడొద్దని సూచించారు.