తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ సీనియర్ నేత ? 

తెలంగాణ ముఖ్యమంత్రిగా దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేయబోతోంది.ఇప్పటికే పార్టీ కీలక నాయకుల అందరితోను ఈ విషయంపై చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంది.

 Telangana Elections, Brs, Congress, Telangana Congress, Aicc, Pcc Chief, Damodar-TeluguStop.com

ముఖ్యంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపిస్తూ ఉండడంతో అధికారికంగా రేవంత్ పేరును ప్రకటించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఈనెల 7వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  సీతక్క,  కొండా సురేఖ,  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  తుమ్మల నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం కాంగ్రెస్ లో జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేవంత్ రాజీనామా చేసే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజానరసింహను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  సామాజిక వర్గ సమీకరణాలను లెక్కలు వేసుకుని దామోదర రాజనర్సింహ పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకుంటోందట.

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Telangana-Politics

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దామోదర రాజనర్సింహ విజయం సాధించారు.దామోదర రాజనర్సింహ సామాజిక వర్గం వారు తెలంగాణలో ఎక్కువగా ఉండడంతో,  ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆ సామాజిక వర్గం అండదండలు ముందు ముందు కాంగ్రెస్ కు కలిసి వస్తాయని అధిష్టానం లెక్కలు వేసుకుంటుందట.ఈ మేరకు త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube