చిక్కుడు పంట సాగుకు ఆశించే తుప్పు తెగుళ్లను నివారించే చర్యలు..!

తీగ జాతి కూరగాయలలో చిక్కుడు పంట ( Beans crop )ఒకటి.చిక్కుడు పంటను పందిరి రూపంలో లేదంటే నేలపై సాధారణ పద్ధతిలో సాగు చేస్తారు.

 Measures To Prevent Rust Pests Expected For Leguminous Crop Cultivation , Pest-TeluguStop.com

కాకపోతే పందిరి విధానంలో సాగు చేస్తే పంటకు తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే సకాలంలో గుర్తించడానికి వీలు ఉంటుంది.తద్వారా సకాలంలో సంరక్షక పద్ధతులను చేపట్టి పంటను సంరక్షించుకోవచ్చు.

చిక్కుడు పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో తుప్పు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తుప్పు తెగుళ్లు ఒక ఫంగస్ వల్ల సోకుతాయి.మట్టిలో ఉండే పంట అవశేషాలు ఈ ఫంగస్ జీవించి ఉంటుంది.మొక్కల సహాయం లేకుండా ఈ ఫంగస్ జీవించలేదు.మొక్కల కణజాలాన్ని ఆహారంగా తీసుకుంటుంది.గాలి, నీరు, ఇతర కీటకాల వల్ల వ్యాపిస్తుంది.

ఈ ఫంగస్ ( Fungus )అధిక తేమ లేదా అధిక ఉష్ణోగ్రత ఉంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.

చిక్కుడు మొక్క ఆకుపై చిరిగిపోయినట్టు ఉండే గోధుమ రంగు నుండి పసుపు బుడిపెలు ముదురు ఆకుల ప్రక్క భాగంలో ఏర్పడతాయి.ఈ తెగులు మొక్క కాండం, కాడలు మరియు కాయలపై కూడా వ్యాపిస్తాయి.ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.

ఈ తెగుల ప్రభావం వల్ల పంట దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.ఈ తెగులు( Pest ) సోకితే చిన్న మొక్కలు చనిపోతాయి.

పెద్ద మొక్కలలో ఎదుగుదల పూర్తిగా తగ్గుతుంది.సేంద్రీయ పద్ధతిలో ఈ తెగులను నివారించాలంటే.

బాసిల్లస్ సబ్టిలిస్, అర్ధోరోబాక్టర్ లాంటి జీవ కీటక నాశలను ఉపయోగించి ఈ తెగులను వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు.రసాయన పద్ధతి( Chemical method )లో ఈ తెగులను నివారించాలంటే.

త్రయాజోల్, స్ట్రోబిల్లురిన్ లలో ఏదో ఒక దానిని మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి పంటను సంరక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube