డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir kapoor) రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్ (Animal).ఈ సినిమా డిసెంబర్ 1 తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.మొదటి రోజే సుమారు 100 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ అదే జోరుతో దూసుకుపోతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ ప్యాలెస్ ని ఎంతో అద్భుతంగా చూపించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ ప్యాలెస్( Palace ) రియల్ ప్యాలెస్ అని తెలుస్తోంది.ఇది సెట్ కాదని నిజమైనటువంటి ప్యాలెస్ లోనే ఈ సినిమా చిత్రీకరణ చేశారని తెలుస్తుంది.అయితే ఈ ప్యాలెస్ ఓ బాలీవుడ్ హీరోకి చెందినదని తెలుస్తుంది.
మరి ప్యాలెస్ ఏ హీరోది అనే విషయానికి వస్తే.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కొనసాగుతున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ కి( Saif Ali Khan ) చెందిన ఈ ప్యాలెస్ లో యానిమల్ సినిమా(Animal Movie) షూటింగ్ చిత్రీకరించాలని తెలుస్తోంది.
ఈ ప్యాలెస్ సైఫ్ అలీఖాన్ కి చెందిన పటౌడీ ప్యాలెస్.( Pataudi Palace ) వీరిది రాజ కుటుంబం.ఈ ప్యాలస్ పది ఎకరాల విస్తీర్ణంలో 150 రూమ్స్ కలిగి ఉంటుంది.ఇక దీని విలువ వచ్చి సుమారు 800 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.ఈ విషయం నార్త్ ఇండియన్స్ కి తెలిసినప్పటికీ సౌత్ ప్రేక్షకులకు మాత్రం తెలియదు అయితే ఇంత విలువైనటువంటి బంగ్లా సైఫ్ అలీ ఖాన్ అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.చూడటానికి ఎంతో రిచ్ లుక్ లో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ ధర కూడా 800 కోట్లు అని తెలిసి షాక్ అవుతున్నారు.