వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె వివాహం చేసుకొని కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో తిరిగి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ ( Satyabhama ) అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇదివరకే విడుదల చేసినటువంటి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులలో జరుపుకుంటుంది.తాజాగా కాజల్ అగర్వాల్ ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సినిమా ద్వారా మొదటిసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతున్నానని ఇలాంటి సినిమాలను ఎందుకు మిస్ అయ్యాను అనిపిస్తుంది అంటూ తెలిపారు.

ఇక తన కొడుకు గురించి కూడా మాట్లాడుతూ నేను ఎప్పుడూ కూడా నా మొదటి ప్రాధాన్యత నా కొడుకు నీల్ ( Neil ) కే ఇస్తానని తెలియజేశారు.కొడుకు తర్వాతనే సినిమాలైనా మరేదైనా అంటూ కూడా కాజల్ అగర్వాల్ తెలియజేశారు.తాను నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయిందని కాజల్ తెలిపారు.
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో లాంగ్ షెడ్యూల్ ఉండటం వల్ల తనతో పాటు తన కొడుకుని కూడా హైదరాబాద్ తీసుకువచ్చానంటూ ఈమె తన కొడుకు పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.







