ప్రస్తుత కాలంలో మనుషులు నిజజీవితంలో కంటే మొబైల్ ఫోన్ లో జీవిస్తున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.కొందరు మొబైల్ వారి సంపాదనకు వినియోగిస్తుంటే మరికొందరు కాలక్షేపానికి వినియోగిస్తూ రోజులు కలిపేస్తున్నారు.
ఇక సోషల్ మీడియా( Social media ) పుణ్యమా అంటూ చాలామంది యువత ప్రస్తుతం మొబైల్ ఫోన్లకు బానిసగా మారిపోయారు.సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్, వీడియోస్ వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.తాజాగా స్నేహితుల బృందం చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ ( Viral )గా మారింది.ఓ నగర శివారులలోని కొండ ప్రాంతంలోకి వెళ్లిన స్నేహితుల బృందం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో వారు తమాషాగా చేశారో లేకపోతే ఏదైనా పొరపాటున జరిగిందో తెలియదు కానీ.ఆ స్నేహితుల బృందం లోని ఓ స్నేహితుడు కాస్త కొండపై నుంచి కింద పడిపోతున్న సందర్భాన్ని మనం గమనిస్తాం.
అయితే ఈ వీడియో చూస్తే మాత్రం వీడియో తీసే వ్యక్తి నైపుణ్యత గురించి మాట్లాడవచ్చు.ఇంతకీ ఆ వీడియోలో.ఓ వ్యక్తి బండరాయికి చివరగా వేలాడుతూ కనిపిస్తాడు.అయితే అంత ఎత్తులో ఉన్న ఆ కొండ రాయి పైనుండి ఆ వ్యక్తి పడిపోవడం వేలాడడం అందరికీ గుండె జారిపోయినంతగా అనిపిస్తుంది.
ఇకపోతే ఆ వీడియో చివరిలో ఆ ప్రాంతం చూస్తే ఆ కొండ బండరాయి( Hill rock ) కిందనే భూమి ఉండడంతో అందరూ ఊపిరి తీర్చుకుంటారు.ఓ స్నేహితుడు అలా వేలాడుతూ అర్ధనాథాలు చేస్తుండగా వారి స్నేహితులు ఇద్దరు కిందికి వచ్చి ఆ స్నేహితుని కింద పడకుండా జాగ్రత్తగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.దీంతో ఈ వీడియో ( video )కాస్త వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.