ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023 సంవత్సరం గాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన నగరాల జాబితాను తాజాగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తన నివేదికను వెలువడించింది.తాజాగా ప్రచురించిన నివేదికలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్ తన స్థానాన్ని కొనసాగించింది.
ఆ తర్వాత జూరిచ్, జెనీవా, న్యూయార్క్, హాంకాంగ్ ( Hong Kong )నగరాలు ఉన్నాయి.ఇందులో భాగంగానే ప్రపంచ జీవన వయ్య సంక్షోభం పూర్తిగా ముగియలేదని నివేదిక హెచ్చరించింది.
ఇక ఎందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
2023 సంవత్సరంగాను సింగపూర్ ( Singapore )తోపాటు జూరిచ్ నగరం కూడా మొదటి స్థానంలో నిలిచాయి.ఇకపోతే గత సంవత్సరం సింగపూర్ తో పాటు న్యూయార్క్ నగరం కూడా మొదటి స్థానంలో నిలిచింది.కాకపోతే ఈసారి మాత్రం న్యూయార్క్ నగరం మూడో స్థానానికి పడిపోయింది.
గత ఏడాది ఆరో స్థానంలో ఉన్న జ్యూరీ నగరం ఏకంగా ఈసారి మొదటి స్థానానికి చేరుకుంది.ఇకపోతే అన్ని రంగాలలో అధిక ధరల స్థాయిల కారణంగా సింగపూర్ గడిచిన 11 సంవత్సరాలలో ఏకంగా తొమ్మిది సార్లు తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది.
ఇందులో ముఖ్యంగా కార్ నెంబర్ లపై ఉన్న కఠినమైన ప్రభుత్వ నియంత్రణ కారణంగా ఈ నగరం ప్రపంచంలోని ఎక్కువ రవాణా ధరను కలిగి ఉంది.
కేవలం వాహనం రంగం ధరలు మాత్రమే కాకుండా కిరాణా, దుస్తులు, మద్యం లాంటి వాటిపై కూడా అతి ఖరీదుగా ఉండటం వల్ల సింగపూర్ మొదటి స్థానంలో నిలుస్తోంది.ఇకపోతే ఈ నివేదికలో చైనాకు చెందిన నాలుగు నగరాలు వాటి ర్యాంకులను కోల్పోయాయి.చైనాలోని నాన్జింగ్, వుక్సి, డాలియన్, బీజింగ్ నగరాల ర్యాంకులు దిగజారిపోయాయి.
వీటితోపాటు రష్యా ( Russia )దేశంలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ లాంటి నగర స్థానాలు కూడా దిగజారాయి.ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 173 నగరాలకు సంబంధించి ఈ సర్వే ఇకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వే నిర్వహించింది.