కాకినాడ జిల్లా భైరవపాలెం నడి సముద్రంలో ఉన్న సమయాన ఓ బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాద సమయంలో సుమారు పది మంది మత్స్యకారులు బోటులో ఉన్నారు.
ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది మత్స్యకారులను రక్షించారు.బోట్ ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ జరగటం వలనే ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మత్స్యకారులను కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.