తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) పోలింగ్ సరళి ఎవరికి అంతు పట్టడం లేదు.గెలుపు పై ఎవరికి వారు ధీమా గానే ఉన్నారు.
ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాము అంటూ ధీమా గా ప్రకటనలు చేస్తున్నారు.ఓటు వేసేందుకు భారీగా జనాలు క్యూ కట్టడం, వివిధ వర్గాల ప్రజలు పోలింగ్ కు హాజరైన తీరు ఇలా అన్నిటిని అంచనా వేస్తున్నారు.
ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BRS, Congress )పార్టీల మధ్యనే నెలకొందనే అంచనాలు ఉండగా , బిజెపి మాత్రం హంగ్ ఏర్పడితే తానే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది.యువత ఎక్కువ శాతం ఓటింగ్ పాల్గొన్నట్లుగా అంచనాలు ఉండడంతో , ఈసారి ఎక్కువ చోట్ల పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
కనీసం 40 నుంచి 50 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని , వాటిలో 15 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ అంచనా వేస్తోంది .గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరుగుతాయి అని అంచనా వేస్తోంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి( BJP ) ఏడు శాతం ఓట్లు లభించాయి.ఒక స్థానాన్ని గెలుచుకుంది.
అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లో 18 శాతం ఓటింగ్ బిజెపికి లభించింది.నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగింది.2018తో పోలిస్తే 2019 ఎన్నికల నాటికి బిజెపి బాగానే బలం పుంజుకున్నట్టుగా తేలింది.ఇక అప్పటి కంటే ఇప్పుడు బిజెపి గ్రాఫ్ మరింతగా పెరిగిందని, తక్కువలో తక్కువ 20 స్థానాల్లో నైనా బిజెపి అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకంతో ఉంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో , హంగ్ ఏర్పడితే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో బిజెపి ఉంది.ఇదిలా ఉంటే నిన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) తెలంగాణ బిజెపి నేతలను ఆరా తీశారట.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోది( Prime Minister Narendra Modi ), వివిధ రాష్ట్రాల బిజెపి పాలిత ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు తమకు కలిసి వస్తాయని, బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణ పై తీసుకున్న అనుకూల నిర్ణయం ఇవన్నీ తమకు మెరుగైన ఫలితాలు తీసుకువస్తాయి అని బిజెపి అంచనా వేస్తోంది.
ఇక పోలింగ్ రోజున బీఆర్ఎస్ అభ్యర్థులు ,కార్యకర్తలు అనేక అల్లర్ల కు పాల్పడినా పోలీసులు పట్టించుకోకపోవడం పై , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం.