తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది.ఈ మేరకు పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది.
రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
కాగా 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు.పోలింగ్ నేపథ్యంలో పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేశారు.
ఇప్పటికే సుమారు లక్ష మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.
ఈ క్రమంలో రేపు సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది.మొత్తం ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షించనుంది.