రాజకీయం ఎన్నికలు అనేది ప్రస్తుతం డబ్బుతోనే మూడు పడిపోయాయి.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంత భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా, హామీలు ఇచ్చినా , పోలింగ్ ముందు రోజు పంచిపెట్టే సొమ్ముల పైన అందరి దృష్టి ఉంటుంది.
ఏ పార్టీ.ఏ అభ్యర్థి ఎక్కువ నోట్లు పంచితే వారికే ఛాన్స్ అన్నట్టుగా పరిస్థితి తయారయింది.
అసలు ఎన్నికల్లో( Election ) ఓటర్లకు డబ్బులు పంపిణీ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది .ఎన్నికల్లో ఓటు వేసేందుకు నోటు తీసుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఉపయోగం కనిపించడం లేదు.ఓటుకు నోటు ఇవ్వడం ఎంత తప్పో తీసుకోవడం కూడా అంతే తప్పు. ఈ విషయంపై ఎన్ని రకాలుగా ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, పరిస్థితి మాత్రం మారడం లేదు .
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను( Telangana Assembly elections ) ఓటుకు నోటు కీలకంగా మారింది.ఎవరు ఎక్కువ సొమ్ములు ఇస్తే వారికి ఓటు అన్నట్లుగా ఎక్కువమంది ప్రజల అభిప్రాయం ఉంది.ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ సొమ్ములు పంపిణీ పైనే దృష్టి పెట్టాయి.నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో బిజీగా మారారు.కాలనీ సంఘాలు, కుల, మహిళా సంఘాలతో రహస్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే మద్యం బాటిల్లు, నగదును ద్వితీయ శ్రేణి నేతలు ఓటర్లకు పంపిణీ చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇక స్థానిక వ్యాపారులు అనుచరులతో ఫోన్ పే ,గూగుల్ పే వంటి యూపీఐ యాప్ ల ద్వారా నగదు పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఓటుకు రెండు నుంచి ఐదువేల వరకు సొమ్ములు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
అన్ని పార్టీల దగ్గర డబ్బు తీసుకుని ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓట్లు వేసేందుకు ఓటర్లు కూడా సిద్ధం అవుతున్నారట.
నోట్లు , మద్యం ( Notes liquor )పంపిణీ ని అడ్డుకునేందుకు పోలీసులు , ఎన్నికల సంఘం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా , ఎటువంటి అడ్డంకులు లేకుండా పగడ్బందీగా ఈ నోట్ల పంపిణీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ప్రధాని పార్టీలన్నిటికీ ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో ఎంత సొమ్ములైన ఖర్చు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నాయి.దీనికి తగ్గట్లు గానే అన్ని పార్టీల నుంచి ఓటర్లు భారీగానే సొమ్ములు ఆశిస్తున్నారు.