కొత్త చంద్రబాబును చూస్తారు...బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.నరసాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ( YCP ) ప్రభుత్వంపై మండిపడ్డారు.

 See The New Chandrababu Buddha Venkanna Sensational Comments , Tdp, Chandrababu,-TeluguStop.com

వైసీపీ చేసేది బస్సు యాత్ర కాదు బేవర్స్ యాత్ర అని సెటైర్లు వేశారు.తెలుగుదేశం.

జనసేనా పార్టీలు అధికారంలోకి రాగానే నాలుగున్నర ఏళ్లలో.విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తూ చంద్రబాబు( Chandrababu ) మొదటి సంతకం చేస్తారని బుద్దా వెంకన్న తెలియజేశారు.

ఇదే సమయంలో 1978 నుంచి 2019 వరకు చంద్రబాబు వేరు.రేపు 2024 నుంచి కొత్త చంద్రబాబుని చూస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గేట్లు ఎత్తితే వైసీపీలో ఎవరు మిగలరు అని అన్నారు.ఇదే సమయంలో రాష్ట్రంలో ఎంతవరకు ఎవరికి టికెట్లు కేటాయించలేదని ఒకవేళ ఎవరైనా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్న అది అవాస్తవమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.చంద్రబాబు మళ్లీ జనంలోకి వస్తే… రాష్ట్రంలో జన సునామినేని.పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి పార్టీ శ్రేణులంతా కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు.సోమవారం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో ఉండకపోవచ్చు అని అన్నారు.

ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది.దీంతో త్వరలో చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు.

ఈ క్రమంలో బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు.ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube