అమెరికా( America )లో విషాదం చోటు చేసుకుంది.భారత్‌కు చెందిన 26 ఏళ్ల డాక్టోరల్ విద్యార్ధి కారులో శవమై తేలాడు.
మృతుడు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇతను ఓహియో రాష్ట్రంలో కాల్పుల ఘటన తర్వాత తన కారులో చనిపోయి కనిపించాడు.
మృతుడిని ఆదిత్య అద్లాఖాగా గుర్తించారు.ఈ నెల ప్రారంభంలో సిన్సినాటీలోని వెస్ట్రన్ హిల్స్ వయాడక్ట్‌పై డ్రైవింగ్ చేస్తుండగా ఇతని కారు తుపాకీ కాల్పుల్లో చిక్కుకుందని ఓహియోకు చెందిన డబ్ల్యూఎల్‌డబ్ల్యూటీ న్యూస్ ఛానెల్ నివేదించింది.
గోడను ఢీకొన్న వాహనంలో ఆదిత్య వున్నట్లు గుర్తించామని.డ్రైవర్ వైపు వున్న గ్లాస్‌పై మూడు బుల్లెట్ రంధ్రాలు వున్నట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల అనంతరం యూసీ మెడికల్ సెంటర్‌కు ఆదిత్యను హుటాహుటిన తరలించగా.అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 11న అతను మరణించినట్లు హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు, అలాగే కాల్పులకు దారి తీసిన కారణాలు ఏంటనే దానిపై ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు.కాలేజ్ ఆఫ్ మెడిసిన్ మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ఆదిత్య చేరారు.2025లో తన డాక్టరేట్ పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకోగా.ఇంతలో ఈ దారుణం జరిగింది.

యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలోని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ ఆండ్రూ ఫిలక్.ఆదిత్య మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.“novel and transformative” అనే పరిశోధనా గ్రంథాన్ని ఆయన రూపొందించినట్లు ఫిలక్( Andrew Filak ) చెప్పారు.అతనిని స్నేహితుడిగా, విద్యార్ధిగా, సహోద్యోగిగా గుర్తుంచుకుంటామన్నారు.
యూనివర్సిటీ ప్రకటన ప్రకారం.ఆదిత్య గతేడాది ‘‘ulcerative colitis’’పై పరిశోధనలో సహకరించినందుకు గాను స్టైఫండ్ పొందాడు .న్యూఢిల్లీ( New Delhi )లోని రాంజాస్ కాలేజీ నుంచి జంతు శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఆదిత్య.ఎయిమ్స్ నుంచి 2020లో ఫిజియాలజీలో మాస్టర్స్ చేశాడు.