సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలో గిల్ ను వెనక్కి పిలిచిన రోహిత్ శర్మ..ఎందుకో తెలుసా..?

వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో భాగంగా వాఖండే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్ లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్( New Zealand ) పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.భారత జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్ 66 బంతుల్లో 80 పరుగులు చేసి అజయంగా నిలిచాడు.

 Rohit Sharma Called Gill Back In The Middle Of The Semi Final Match.. Do You Kno-TeluguStop.com

అయితే ఓపెనర్ గా బరిలోకి వచ్చిన గిల్ మధ్యలో రిటైర్డ్ హార్ట్ గా వెనక్కి తిరిగాడు.గిల్ తన వ్యక్తిగత స్కోర్ 79 పరుగుల వద్ద మైదానం నుంచి వెనక్కి తిరిగాడు.

గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) క్రీజులోకి వచ్చాడు.

గిల్ ను రిటైర్డ్ హార్ట్ గా మైదానం నుంచి వెనక్కి పిలిచింది భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మనే.ఎందుకంటే.గిల్ కాలి కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు.

అది గమనించిన కెప్టెన్ రోహిత్ శర్మ ,రవిచంద్రన్ అశ్వినితో చెప్పి గిల్ ను వెనక్కి వచ్చేయమని సంకేతాలు ఇచ్చాడు.

గిల్( Shubman Gill ) అతి కష్టం మీద బ్యాటింగ్ కొనసాగిస్తే గాయం అయ్యే ప్రమాదం ఉంది.పైగా గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యే సమయానికి భారత జట్టు పటిష్ట స్థితిలో ఉందని రోహిత్ శర్మ భావించాడు.ఒకవేళ గిల్ కు గాయం అయితే ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే పరిస్థితి ఉండవచ్చు.

గిల్ ను ఫైనల్ మ్యాచ్లో ఆడించాలనే ఉద్దేశ్యంతో మాత్రమే వెనక్కి పిలవడం జరిగింది.ఫుల్ ఫామ్ లో ఉన్న గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడడం భారత జట్టుకు ఎంతో కీలకం.

ఇక భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 397 భారీ పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది.న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లను భారత జట్టు కట్టడి చేసి 70 పరుగుల తేడాతో సెమి ఫైనల్ మ్యాచ్లో భారీ ఘన విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube