పాయల్ రాజ్ పుత్….ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
ఢిల్లీలో పుట్టి పెరిగిన పాయల్ ముంబైలో ప్రస్తుతం నివసిస్తుంది.చిన్నప్పటినుంచి సినిమా పరిశ్రమలో మెరిసిపోవాలని కలలుగన్న పాయల్ మొట్టమొదటగా సీరియల్స్ ద్వారా హిందీ టెలివిజన్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత పంజాబీ భాషలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.వేరే కి వెడ్డింగ్ అని హిందీ సినిమా తర్వాత తెలుగులోకి RX100 ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పంజాబీ హిందీ తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న పాయల్ దాదాపు ఆరేళ్లుగా ఏదో ఒక భాషలో టాప్ హీరోయిన్ అవ్వాలని కలలు కంటున్నప్పటికీ ఎక్కడ కూడా ఆమె ఫిక్స్డ్ హీరోయిన్ గా ఉండలేకపోతోంది.
అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆమెను ఒక బోల్డ్ కంటెంట్ గానే చూడటం వల్ల ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఆమె చేసిన మొట్టమొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తెలుగులో విజయం సాధించింది కానీ ఆమెను నెగటివ్ పాత్రలో చూపించడంతో తెలుగులో ఎవరూ కూడా ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు.అలాంటి బోల్డ్ కంటెంట్ చిత్రాలు మాత్రమే పాయల్ ని పలకరిస్తున్నాయి ఒకటి రెండు మంచి సినిమాలు పడ్డా కూడా అందులో పాయల్ కి మంచి పేరు రాలేదు.
ఇప్పుడు మరొక వారం రోజుల్లో మంగళవారం అనే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో నటించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న పాయల్ తనకు అచ్చోచ్చిన బోల్డ్ కంటెంట్ ని నమ్ముకొని బరిలోకి దిగుతుంది.ఇప్పటి వరకు ఎవరు చూడని విధంగా పాయల్ నటించింది అనే వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల అయినా తర్వాత ఆమె ఫెట్ ఏమైనా మారుతుందా లేదా అదే పాత మూసలో వెళ్తుందా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలాల్సి ఉంది.