జిల్లాలో గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు.

తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 32 గంజాయి కేసులు నమోదు,42 మంది అరెస్ట్, 33 కిలోల 566 గ్రాముల గంజాయి స్వాధీనం.

 Strong Measures To Eliminate Ganja And Drugs In The District , Ganja , Drugs, S-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం రోజు జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది సి.ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నీల్ కంటూ పాడల్,24 సం.అనే వ్యక్తి ఒరిస్సా రాష్టం నుండి అక్రమంగా గంజాయి వేములవాడ పట్టణానికి అమ్మడానికి వస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు తిప్పపూర్ బస్టాండ్ వద్ద టాస్క్ఫోర్స్ సిబ్బంది నీల్ కంటూ పాడల్ ని అదుపులోకి తీసుకొని 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం వేములవాడ పట్టణ పోలీస్ వారు అట్టి నిందుతుని పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.

వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని,జిల్లా పరిధిలో తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.గంజాయి మత్తులో ఎంతో మంది యువత వారికి తెలియకుండానే నేరాలకు పాల్పడి జైలుజీవితం గడుపుతున్నారు.

గంజాయి,మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో గడిచిన రెండు నెలల కాలంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న,సేవిస్తున్న వారిని గుర్తించి 32 కేసులలో 52 మందిని అరెస్ట్ చేసి 33 కిలోల 566 7గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube